ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 అల్లూరి సీతారామరాజు  గారు మన్య ప్రాంతంలో ఉన్న  పురుష శ్రేష్టులను కలిసి  వారి ప్రవర్తనను మార్చుకోవాలని  చెడ్డ అలవాట్లకు లోనై జీవితాలను నాశనం చేసుకోవద్దని  త్రాగుడు వ్యభిచారం లాంటి వాటి జోలికి వెళ్ళవద్దు అని  దానివల్ల జరిగే దుష్పరిణామాలను  తెలియజేస్తూ వారిని యుద్ధ వీరులుగా తయారు చేశారు.  ప్రతి ఒక్కడు పదిమందిని ఎదిగించగలిగిన స్థితిలో చివరకు స్త్రీలలో కూడా ధైర్యాన్ని నింపి ఖాళీ సమయంలో కుటుంబానికి  అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే  పనులను గురించి తెలియజేస్తూ దేశానికి మంచి చేయడానికి వారి సహకారాన్ని  అందించాలని కోరారు. అలా మన్య ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవంగా కొలవబడుతున్నారు అల్లూరి సీతారామరాజు గారు.
సీతారామరాజు గారి శిక్షణ  కొంచెం భిన్నంగా ఉంటుంది  ఉదాహరణకు మల్లు  దొరను  వీరునిగా తయారు చేసి   అతనికి సాటి మరి ఎవరు లేరు అన్నట్లుగా  విద్య నేర్చుకున్న తర్వాత రాజు గారి దగ్గర నేర్చుకున్న విద్యను తన శిష్యులకు తెలియజేయడం  అలా శిష్య ప్రశిష్య  పద్ధతిని ఏర్పాటు చేసి  వారికి  విలువిద్య తో పాటు కుస్తీ పట్టడం ఈత అలాంటి అనేక  విద్యలను నేర్పారు. స్త్రీలలో కూడా ఒకరిని కుటుంబం కోసం చేస్తున్న పనుల ద్వారా  ఆదాయాన్ని పెంచుకునేలా తయారు చేసి ఆమె ద్వారా మిగిలిన కుటుంబాలలో స్త్రీలను సమకూర్చి వారి అభిరుచిని పెంచి వారు కూడా  కుటుంబానికి కావలసిన అవసరాలను తీర్చడానికి  ఏమేమి చేయాలో అన్నీ తెలియజేస్తూ  మన్య ప్రాంతాన్ని  సుభిక్షంగా ఉండేలా తయారు చేశారు.
గాము సోదరులలో గండరగండడు మల్లు దొర  మల్లులందరిలోకి మేటి  గుబురుగా ఉన్న మీసం ఇతర దేశస్తులుచూస్తే గుడ్లు నిప్పులు రాల్చేతత్వం  అతని స్నేహితుడు దొడ్డ ఏనుగుల వారితో పాటు అతి వారినిస్తారు  కర్ర సాములో కానీ కత్తియుద్ధంలో కానీ ఎదురేలేని యోధుడు  అతనికి ఉన్న  త్రాగుడు వ్యభిచారాలను  పూర్తిగా మానే  పద్ధతులను తెలియజేసి ఉత్తమునిగా తయారుచేసిన ఘనుడు అల్లూరి సీతారామరాజు  తన గురువు వాళ్ళు రామరాజు కొరకు ప్రాణాలు ఇవ్వడానికైనా  సిద్ధపడే యోధుడు రాజు గారి ప్రథమ శిష్యునిగా పేరు పొందాడు అనేకమంది వీరులను తయారు చేయడంలో సిద్ధహస్తునిగా తయారయ్యాడు మల్లు దొర అంటే ఆ గూడానికి  దొర లాంటివాడు అనిపించుకున్నాడు.కామెంట్‌లు