చాలా అందము;- -గద్వాల సోమన్న,996641458
మిలమిల మెరిసే తారలు
గలగల పారే యేరులు
చాలా చాలా అందము 
కళకళలాడే గృహములు

చకచక నడిచే పిల్లలు
పకపక నవ్వే మోములు
చాలా చాలా అందము 
జాబిలి వెన్నెల జల్లులు

తెల్లని మల్లెల మాలలు
చల్లని హిమగిరి వన్నెలు
చాలా చాలా అందము 
అల్లరి చేసే బాలలు

గృహ సీమలో వనితలు
కుటుంబంలో పెద్దలు
చాలా చాలా అందము
ప్రేమలొలికే మనసులు
0

కామెంట్‌లు