వెన్నెలమ్మ హితవు;- -గద్వాల సోమన్న,9966414580
మాట తప్పని వాడు
మడిమ తిప్పని వాడు
మహిని చూడగ ఱేడు
ఓ వెన్నెలమ్మ!

చెలిమి మనిషికి తోడు
జీవితానికి గూడు
 దాని విలువను చూడు
ఓ వెన్నెలమ్మ!

వైరము వల్లకాడు
చేయు బ్రతుకును మోడు
విడిచిపెట్టుము నేడు
ఓ వెన్నెలమ్మ!

అన్నదాతల గోడు
వినే వాడే లేడు
మిగిలినది ఉరితాడు
ఓ వెన్నెలమ్మ!

వినుము పెద్దల వాక్కు
దీవెన మనకు దక్కు
తుదకు వారే దిక్కు
ఓ వెన్నెలమ్మ!


కామెంట్‌లు