మా ఇల్లు-మమతల పొదరిల్లు;- -గద్వాల సోమన్న,9966414580.
అమ్మ ఉన్న మా ఇల్లు
అందమైన పొదరిల్లు
పరిమళించును ప్రేమలు
తెప్పరిల్లును మనసులు

కిలకిలమను నవ్వులతో
కళకళలాడు పిల్లలతో
పెద్దలున్న మా ఇల్లు
ఆకసాన హరివిల్లు

వెలుగులీను వనితలతో
నిండుదనమే వారితో
బలే బలే మా ఇల్లు
అనురాగాల విరిజల్లు

అందరున్న మా ఇల్లు
ఆత్మీయతకు ఆలయం
ఆదర్శాల మా ఇల్లు
ఆనందాలకు నిలయం


కామెంట్‌లు