అమూల్యమైనది ఓర్పు;- -గద్వాల సోమన్న,9966414580
ఓర్పు ఎంతో గొప్పది
కల్గియుంటే మంచిది
దాని వలనే లాభాలు
లేకుంటే నష్టాలు

సముద్రమంత విశాలము
అమ్మలోని ఓర్పు గుణము
సహనానికి నిర్వచనము
అమెకుంది త్యాగ గుణము

ఓర్పులోనే  ఓదార్పు
తెచ్చిపెట్టు  గొప్ప మార్పు
సకల పనులు సమకూరును
విజయాలే దరి చేరును

భూమాతకు బలే ఓర్పు
పాఠాలెన్నో నేర్పు
అలవర్చుకో! బ్రతుకులో
అమూల్యమైనది ఓర్పు


కామెంట్‌లు