రారా మా ఇంటిదాక
అనిపిలిచాం.....
ఇపుడు నీ ఇంటికి నిన్ను
చేరుస్తున్నాం
నీ నగుమోమును గనలేమని
మా జాలి తెలిసి వస్తున్న
నిన్ను స్వాగతిస్తున్నాం
తలచినంతనే ఝల్లు మనే
నీ నామం దేశమంతా
ప్రతిధ్వనిస్తుంటే వింటున్నాం
నిన్నే నెఱ నమ్మినామని
మా నమ్మకం నిజం చేయడానికి
వస్తున్నావని సంబరపడుతున్నాం
బంటురీతి కొలువివ్వమని
నీ ముంగిట మొక్కులు
మొక్కాలని వేచి ఉన్నాం
మా పక్కల నిలబడ్డ నీవే
మా ధైర్యం విజయంగా
నీ ఇంటికి నిన్ను స్వాగతిస్తున్నాం
మము పాలింప నడచివచ్చిన
నిన్ను చూసి మాకూ శబరిలా
నీ రూపు ఆనక నిండుకుంటున్నాయి.
దొరకునా ఇటువంటి సేవ అని
నీ రాకను పండుగలా
మా మనసులు నింపుకుంటున్నాం
మా జానకి చెట్టబట్టగా
రామభక్తి సామ్రాజ్యములొ
జగదానందకారకుడైన నీ
మందిర నిర్మాణానికి
సమయానికి తగు కరుణ
చూపి ఎందరో మహానుభావులచే
తవ దాసోహం అనిపించుకున్న నీకు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి