సుప్రభాత కవిత ; -బృంద
వెలుగులతో జతకట్టి
విరిసి మెరిసే పువ్వులతో
మురిసి పోతూ  తరగని
జిలుగులు నింపుకున్న తరువు

అందమైన రూపుతో
ఆహ్లాదమైన రంగులతో
ఆనందం పంచే దారి
హర్షం పెంచే రహదారి

సాగేటి బాటలో
తోడొచ్చు నీడ
చేరాల్సిన తీరం వేపు
మనని తరిమే తోడు

గమ్యం వైపు నడిచే
అడుగులను
అవలీలగ జరిపించు
సడలని నిర్ణయం

దూరాన తోచే తారాదీపం
చేరే వరకూ తగ్గని ధైర్యం
మారిన కాలంతో కలిసి
చేసే సహగమనం

ఊహలంటి నిజాలను
ఊరించే విజయాలను
ఊయలూగే మనసుకు
ఊపిరిగా మార్చే వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు