శ్రీ విష్ణు సహస్రనామాలు-(బాల పంచపది ; -ఎం. వి. ఉమాదేవి )
116)భబ్రుః -
==========
లోకములను భరించువాడు
జీవులకు భారం వహించువాడు
విశ్వమును మోయుచున్నవాడు
భబ్రు వాహనుడైనట్టివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
117)విశ్వయోనిః -

సమస్తముకు జన్మస్థానకుడు
విశ్వముకు మూలమైనవాడు
ప్రాణులకు కారణమైనవాడు
అనాదిమూలము తానైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
118)శుచి శ్రవాః -

శుచియైనట్టి రూపo గలవాడు 
శుభనామములు గలిగినవాడు 
శ్రవణపేయమైనట్టి వాడు
శుభప్రదుడు నారాయణుడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
119)అమృతః -

మరణము సమీపించనివాడు
నిత్యుడై వెలుగొందువాడు
అమృతతత్వం కలిగినవాడు
అమృతమునివ్వగల వాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
120)శాశ్వత స్థాణుః -

నిత్యమై గోచరించెడి వాడు 
స్థిరముగా నుండినవాడు
ఒకే తీరున కనిపించువాడు
నిశ్చలానందమైనట్టి వాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు