కాదేదీ కవితకనర్హం
అన్నాడు శ్రీశ్రీ
అందుకే నాకిప్పుడు
సబ్బుబిళ్ళ కవితా వస్తువైంది
చెప్పొద్దు సుమీ!
నిజంగానే సబ్బుబిళ్ళ
ఎంత సుకుమారమో కదా!
పట్టుకుంటే జారిపోతుంది
పసిపాపలా అమాయకం
నీళ్ళు తగిలితే చాలు
ఆనందంతో వెన్నలా కరిగిపోతుంది
శిశువూ పశువూ,
చిన్నా పెద్దా,
తెలుపూ నలుపూ,
కులమూ మతమూ,
ధనికా బీదా
ఇలాంటి భేదాలేమీ లేని
నిజమైన సోషలిస్టు
అందర్నీ
తల్లిలా ఒళ్ళంతా స్పృశించి
మాలిన్యాన్ని కడిగి స్వచ్ఛపరుస్తుంది
సబ్బును సమీపిస్తే చాలు
తనువూ మనసూ
రెండూ శుభ్రపడుతాయి
రెండూ పరిమళిస్తాయి
రెండూ గగనాంతరలోకంలో
విహరిస్తాయి
అందుకే
సబ్బుకు జోహార్!!
**************************************
అన్నాడు శ్రీశ్రీ
అందుకే నాకిప్పుడు
సబ్బుబిళ్ళ కవితా వస్తువైంది
చెప్పొద్దు సుమీ!
నిజంగానే సబ్బుబిళ్ళ
ఎంత సుకుమారమో కదా!
పట్టుకుంటే జారిపోతుంది
పసిపాపలా అమాయకం
నీళ్ళు తగిలితే చాలు
ఆనందంతో వెన్నలా కరిగిపోతుంది
శిశువూ పశువూ,
చిన్నా పెద్దా,
తెలుపూ నలుపూ,
కులమూ మతమూ,
ధనికా బీదా
ఇలాంటి భేదాలేమీ లేని
నిజమైన సోషలిస్టు
అందర్నీ
తల్లిలా ఒళ్ళంతా స్పృశించి
మాలిన్యాన్ని కడిగి స్వచ్ఛపరుస్తుంది
సబ్బును సమీపిస్తే చాలు
తనువూ మనసూ
రెండూ శుభ్రపడుతాయి
రెండూ పరిమళిస్తాయి
రెండూ గగనాంతరలోకంలో
విహరిస్తాయి
అందుకే
సబ్బుకు జోహార్!!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి