అయోధ్యాపురి;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 పసివాడిగా అవతరించి
వసివాడని తన అపురూప తత్వాన్ని
ప్రపంచానికి చూపించిన ధర్మవిగ్రహం
అధర్మాన్ని సహించని ధర్మాత్మునిగా
ఆ విష్ణుమూర్తి ఒక మనీషిగా
అయోధ్యాపురిలో అవతరించి
సూర్యవంశ రాజుగా, కోసల రాజ్యంలో
దశరథనందనుడై ముగ్గురు తమ్ముల తోడు
అనురాగమూర్తిగా అవతరించాడు
కౌసల్యగర్భ ఫలముగా అద్భుతశిశువుగా
దశరథరాజ అంకముజేరి అల్లరిజేసి
అయోధ్యారామ మట్టిలో 
తన పదకమలములతో అడుగిడి
ఆటలాడిన పుణ్యభూమి కనుక
అక్కడి మట్టిని మన శిరసుపై ధరిస్తే
మనకెంతో పుణ్యం సుమా!
—-------------------------------


కామెంట్‌లు