జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలో "కంబదహాల్ పాఠశాల విద్యార్థుల" ప్రతిభ

 గణతంత్ర దినోత్సవం సందర్భంగా "బాలల తెలుగు భాషాభివృద్ధి సమితి,ముంబై ", వారు నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలో ,కర్నూలు జిల్లా,పెద్దకడబూరు మండలం,కంబదహాల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రథమ,ద్వితీయ, తృతీయ స్థానాలలో బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న ఆధ్వర్యంలో  విజయ దుందుభి మ్రోగించారు.ఒకే పాఠశాల నుంచి ఏకంగా ఎనిమిది మంది విద్యార్థులు విజేతలై పతకాలు సాధించడం అరుదైన ఘనత, ఇతర పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవడం గర్వకారణం. ఈ రోజు జరిగిన 'రిపబ్లిక్ డే' వేడుకల్లో ఈ పతకాలు,ప్రశంసాపత్రాలు విజేతలైన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు యస్.జయవంత్ ద్వారా విచ్చేసిన పుర ప్రముఖులు,ఉపాధ్యాయులు  మరియు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో గెలుపొందిన బాలలకు అందజేశారు.జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొని ప్రతిభను కనపరచిన కంబదహాల్ విద్యార్థులను,ప్రోత్సహించిన ఉపాధ్యాయులు గద్వాల సోమన్న, జయవంత్, వసంతలక్ష్మీ, కేశవయ్య, పద్మావతి, మాబు,నిర్మల రాణి,లక్ష్మీ సాగర్,అనిత మరియు రంగన్నలను అధికారులు, ప్రముఖులు మరియు గ్రామస్తులు అభినందించారు.గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు.
కామెంట్‌లు