ఏదైనా రాలిపావాల్సిందే?;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఏమైనా
రాలిపోవాల్సిందే
కుళ్ళిపోవాల్సిందే
మట్టిలోకలసిపోవాల్సిందే

ఏదైనా 
ఎక్కడైనా
ఎప్పుడైనా
రాలిపోవాల్సిందే

కాయైనా
పువ్వైనా
ఆకైనా
రాలిపోవాల్సిందే

పక్షైనా
పశువైనా
పామైనా
రాలిపోవాల్సిందే

మొక్కైనా
తీగైనా
బోన్సాయైనా
రాలిపోవాల్సిందే

ఆడైనా
మగైనా
శిఖండైనా
రాలిపోవాల్సిందే

పెద్దదైనా
చిన్నదైనా
నడిమిదైనా
రాలిపోవాల్సిందే

పుణ్యాత్ముడైనా
పాపాత్ముడైనా
నిష్కర్ముడైనా
రాలిపోవాల్సిందే

అంగాలైనా
తనువైనా
ఆత్మైనా
రాలిపోవాల్సిందే

ఆవైనా
గేదైనా
మేకైనా
రాలిపోవాల్సిందే

చీమైనా
దోమైనా
నల్లైనా
రాలిపోవాల్సిందే

చేపలైనా
రొయ్యలైనా
పీతలైనా
రాలిపోవాల్సిందే

కుక్కైనా
నక్కైనా
కొంగైనా
రాలిపోవాల్సిందే

మంచిదైనా
చెడ్డదైనా
మామూలుదైనా
రాలిపోవల్సిందే

కొత్తదైనా
పాతదైనా
వాడనిదైనా
రాలిపోవాల్సిందే

కష్టమైనా
నష్టమైనా
ఇష్టమైనా
అన్నీ రాలిపోవాల్సిందే

రాలిపోయేవాటికై
ఆరాటమొద్దు
పోరాటమొద్దు
చింతపడవద్దు

నీ చేతిలోయున్నవి
నువ్వు చేసుకో
నీ చేతిలోలేనివి
నువ్వు మరిచిపో

ఉన్నన్ని రోజులు
బాగాబ్రతుకు

అనవసర ఆలోచనలు
వదిలిపెట్టు

మేనుపై
మోహాన్ని వీడు
ప్రాణంపై
ప్రీతిని వదులు

కామెంట్‌లు