తిరుప్పావై ; -వరలక్ష్మి యనమండ్ర
24వ పాశురము.
**********
అన్జివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి శెన్జంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోత్తి పొన్జచ్చకడం ఉదైత్తాయ్ పుగర్ పోత్తి కన్జుకుణిలా వెఱిందాయ్ కరిల్ పోత్తి కున్జుకుడైయా వెడుత్తాయ్ కుణమ్ పోత్తి వెన్జు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి ఎన్టెన్జుమ్ శేవకమే యేత్తి ప్పతైకొళ్వాన్ ఇన్జు యాం వందోం ఇరంగ్-ఏలోర్ ఎంబావాయ్
***********
భావము...పంచపదులలో
***********
మంగళం జయమంగళం చిన్ని కృష్ణకు మంగళం
దేవతలను కాచినట్టి   కృష్ణస్వామికి మంగళం
వామనుడై  వసుధకొలిచిన  దివ్యమూర్తికి మంగళం
దుష్టరావణు దునిమినట్టి రామచంద్రుకు మంగళం
శూరుడైన ధీరుడైన గోపాలునికి మంగళం


స్థూల సూక్ష్మ శరీరధారుడు కన్నయ్యకు మంగళం
శకటాసురు సంహరించిన కన్నయ్యకు మంగళం
వృక్షాసురు నరికినట్టి నల్లనయ్యకు మంగళం
వత్సాసురు  వధించిన వటపత్రశాయీ మంగళం
అసుర సంహారము చేసినట్టి బాలకృష్ణకు మంగళం

నారసింహుడు నీవే కదా నల్లనయ్యా మంగళం
యుగయుగాల నాయకుడా యశోద తనయా మంగళం
గోవర్ధన గిరిని గొడుగు చేసినట్టి గోపాలా మంగళం
గోకులమును కాపాడిన గోపబాలా మంగళం
శత్రువులను మట్టుపెట్టిన మురళీధరా మంగళం


నీవేగా దివ్యాయుధణు  దివ్యమూర్తీ మంగళం
సిగను నెమలి పింఛమున్న కృష్ణస్వామీ మంగళం
నుదుట కస్తూరి తిలకముగల నల్లనయ్య మంగళం
వేణుగాన లోలా నీకు వేలవేల మంగళం
శంఖ చక్ర ధారివైన విష్ణుమూర్తీ మంగళం 

(మంగళం జయమంగళంబని పాడుచుండిరి గోపికలు)
*********


కామెంట్‌లు