త్రిగుణా రాహిత్యం- సి.హెచ్.ప్రతాప్
 భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునికి త్రిగుణాలు గురిం చి బోధిస్తూ-
”సత్వ రజస్త మ ఇతి గుణా: ప్రకృతి సంభవా!
నిజద్నంతి మహాబాహోదేహ దేహన మవ్యయమ్‌!” అన్నాడు.

అంటే సత్వ—రజో—తమో—గుణములు ప్రకృతి వల్ల ఈ జీవా త్మను, దేహాన్ని బంధించడం వల్ల, మనిషి ఆ త్రిగుణాలులో బందీ అవుతున్నాడు. ప్రకృతిలో అంతర్భాగమైన ఈ మానవుడు, జీవి తంలో జరిగే సంఘటనలకు, మార్పులకు, లోనవుతున్నాడు.
త్రిగుణములు అంటే భగవద్గీతలో వర్ణించిన భౌతిక ప్రకృతి యొక్క గుణాలు. ఇవి తామస లేదా తమోగుణం, రాజస లేదా రజో గుణం, సత్వ గుణం. ఈ మూడు హిందూ ధర్మశాస్త్రాలలో చెప్పబడిన ప్రధాన గుణములు.  త్రిగుణాల కలయికే ఈ ప్రపంచం. రజో, తమ గుణములు మానవుడు వివేకాన్ని హరించి అసురీ లక్షణములను వృద్ధి చేయును. సత్వ గుణం గల్గిన మానవుడు దేవునికి ప్రీతికరం. ఉత్తముల సాంగత్యం, సద్గ్రంధ పఠనం, భగవత్ ధ్యానం, నామ సంకీర్తన, పూజ, జపం ,ఇత్యాది మార్గములెన్నో శాస్త్రములో మనకు లభ్యం. తీవ్రమైన తపనతో, సాధనతో
రజ, తమో గుణములను తగ్గించుకుంటూ , భగవత్స్వరూపమైన సత్వ గుణమును పెంపొందించుకుంటూ , సన్మార్గ వర్తనుడై  చరించడం ఎంతో శ్రేయస్కరం. సత్వ గుణ సంపన్నులే భగవంతునికి ప్రీతికరం. పవిత్ర హృదయం, మనో శుద్ధి,క్రమశిక్షణ లతో జపం, తపం, పూజలు,భజనలు, సంకీర్తన,యోగం ఇత్యాది క్రియలను చిత్తశుద్ధితో ఆచరించడం ఎంతో ముఖ్యం.భగవంతుడు  గుణాతీతుడు.  సత్త్వ, రజో, తమో  గుణములు జీవుని  ఏ విధముగా  బంధించునది, అప్పుడు జీవునికి ఉండే  లక్షణములు, ఫలితములు విశిదీకరించ బడినవి. గుణాతీతుడగు జీవన్ముక్తుడు ఏ ప్రకారముగా ఉండునో భగవద్గీతలో విస్తారంగా చెప్పబడినది.

కామెంట్‌లు