కళా రత్న కుమారి గోగు మేఘన శివానికి కవితా రంగంలో "గిడుగు రామ్మూర్తి జాతీయ పురస్కారం"

  సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్లింగంపల్లి, హైదరాబాదులో ఇటీవల    "గిడుగురామ్మూర్తి పంతులు ఫౌండేషన్" వారు, భారతీ నగర్, బిహెచ్ఇఎల్, రామచంద్రపురం- హైదబాద్  వాస్తవ్యురాలైన కుమారి కళారత్న గోగు మేఘన శివానికి గిడుగు రామ్మూర్తి పంతులు  జాతీయ పురస్కారము( కవితా రంగంలో) ను అందజేశారు.
        కేజీ నుండి పీజీ దాక ఆంగ్ల మధ్యంలో చదువుకున్న మేఘన, సాహిత్య రంగంలో తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న సేవలను గుర్తించి గిడుగు రామ్మూర్తి పంతులు గారి వర్ధంతిని పురస్కరించుకొని, అత్యంత గౌరవప్రదమైన జాతీయ పురస్కారమును కవితా రంగంలో చేస్తున్న సేవలకు గను ముఖ్యఅతిథి, విశ్రాంత గౌరవ జస్టిస్ జి. చంద్రయ్య, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, చైర్మన్ మానవ హక్కుల కమిషన్- తెలంగాణ వారి అమూల్య హస్తములచే బహుకరిం చారు. దాదాపు 200 మందికి పైచిలుకు కవులు, రచయితలు పాల్గొన్న ఈ సాహిత్య కార్యక్రమంలో వేదికపై ముఖ్యఅతిథితోపాటు సభాధ్యక్షులు గౌరవ కళారత్న డాక్టర్ బిక్కీ కృష్ణ, సుప్రసిద్ధ కవి, విమర్శకులు, సీనియర్ పాత్రికేయులు, అధ్యక్షులు నవ్యాంధ్ర సంఘం., విశిష్ట అతిథి: జీవన్ లాల్ లావాడియా, IRS, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ - హైదరాబాద్ అదేవిధంగా ఆత్మీయ అతిథి డాక్టర్ జల్ది విద్యాదర్, 
ఐఆర్ఎస్ మరియు శ్రీమతి గిడుగు కాంతి కృష్ణ, అధ్యక్షులు, గిడుగు రామమూర్తి ఫౌండేషన్ అదేవిధంగా ప్రముఖ కవి, రచయిత ,సినీ దర్శకులు, గాయకులు, సాహిత్య విమర్శకులైన శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడు మరియు డాక్టర్ నాగేశ్వరం శంకరం, తెలంగాణ రచన సంఘం అధ్యక్షులు, సాహితీవేత్త తదితరులు పాల్గొన్నారు.           మేఘన శివాని 
 , La Trobe University, Melbourne, Australia నుండి Master of Engineering విద్యను అభ్యసించారు. ప్రస్తుతం హైదరాబాద్, తెలంగాణలో  'Data Executive'గా 'Google' సంస్థకు సేవలు సల్పుతున్నాను. వివిధ NGO's ద్వారా అనాధ బాల బాలికలకు, పూరి గుడిసెల్లో నివసించే నిరుపేద పిల్లలకు, మరియి వికలాంగులకు క్రమం తప్పకుండా తరగతులు తీసుకుంటారు.
చిన్ననాటి నుండి తెలుగు సాహిత్యంపై మక్కువతో వివిధ సామాజిక అంశాలపై కథలు, కథానికలు, కవితలు, పద్యాలు వ్రాస్తూ వస్తున్నది. అవి ప్రముఖ తెలుగు దిన, వార, మాస పత్రికలలో ప్రచురితం అవుతున్నాయి. ఇప్పటివరకు రెండు పర్యాయాలు తెలుగు ప్రపంచ సాహిత్య వేదికల్లో పాల్గొని స్వయంగా వ్రాసిన కవితలు వినిపించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా వారి ప్రపంచ సాహిత్య వేదికలపై కూడా పలుమార్లు పాల్గొనడం జరిగింది.
 తాను చేస్తున్న సాహిత్య సేవలకు గాను, జాతీయ స్థాయి తెలుగు వెలుగు సాహిత్య వేదిక వారు జాతీయ కళారత్న పురస్కారంతో గౌరవించారు. అంతేగాక,
ఆర్యాణి సకల కళా వేదిక వారు జాతీయ స్థాయి అత్యున్నత స్ఫూర్తి శిఖరం అవార్డు తో సత్కరించారు.
కామెంట్‌లు