'హరీ!'శతకపద్యాలు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 7.
ఉత్పలమాల.
నాలుగుమాటలన్ వినుమ!నాయిడుముల్ తొలగింపరావ!నా
జాలిముఖంబుఁ జూడుమిట!చాల దిగుళ్లను బొంది క్రుంగితిన్
గాలపు మాయలందుబడి క్రమ్మిన మోహములోన జిక్కి నా
పాలిట దైవమంచు నిను భక్తిగఁ బిల్చితినయ్య శ్రీహరీ!//
8.
ఉత్పలమాల.
'తీరికలేదు!లోకములఁ దిద్దుచు పాలన సేయబోదు! నీ
గారపు గోడులన్ వినగఁ గాలము కాదిది పొమ్మ!'టంచు నన్
దూరము సేయకయ్య!పరితోషము నిండిన వీక్షణంబుతో
చేరగ రమ్ము!నా దరికిఁ జింతిలు చుంటిని దీననై హరీ!//

కామెంట్‌లు