కోరిక;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 దర్జీబాబా! దర్జీబాబా!
నీ ఊహలకు రెక్కలుతొడిగి
మమ్మల్ని షోకులరాయుళ్ళుగా మార్చే
నీ చేతుల్లో ఏదో మహత్యం ఉంది సుమా!
అలనాడు ఐజాక్ సింగర్
కుట్టు మిషను కనుగొని
ఎంతోమందికి జీవనోపాధి కల్పించాడు
అనాగరికులై ఆకులు కట్టుకున్నవారు
బట్టలు తొడగడం నీవల్లే నేర్చుకున్నారు
దర్జీబాబా లేనినాడు మాకు దర్జా ఎక్కడిది?
ముక్కలైన బట్టలు కుట్టే నీవు
కుల మత వర్గ వర్ణ లింగ భాషా భేదాలతో
ముక్కలైన మా మనసులను కూడా
కలిపి కుట్టి అందమైన భారతావనిని
భావితరానికి అందించాలని 
నిన్ను మనసారా కోరుతున్నా!!
**************************************

కామెంట్‌లు