తిరుప్పావై ;- వరలక్ష్మి యనమండ్ర
–29వ పాశురము

***********
శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్
ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేళాయ్
పెత్తమ్మేయ్ త్తుణ్ణం కలత్తిల్ పిఱన్దనీ
కుత్తేవలెంగళై క్కొళ్ళమల్ పోగాదు
ఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిన్దా !
ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో
డుత్తోమే యావోమునక్కే నామాళ్ శెయ్ వోమ్
మత్తై నఙ్కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్
**********
భావము ----పంచపదులలో
***********
29 వ పాశురపు భావము

మహాభాగ్యమే కృష్ణా నీనామము
నీ సన్నిధిలోన మేమందరము
పొందిన తృప్తే మహా భాగ్యము
మాకిచ్చితివీ నీ సర్వస్వము
నీవే మాకు ఇహము పరము
..కన్నయ్యా

నిను సేవింపగ వచ్చితిమయ్యా
నిను పూజించగ వచ్చితిమయ్యా
మా తోడ కూడి నీవాడితివయ్యా
నీవు మాకు లభించిన నిధివయ్యా
పరవాద్యము మేమడిగితిమయ్యా.. కన్నయ్యా

ఏడు జన్మలా బంధము మనదీ
ఎవరూ ఇది విడదీయ లేనిదీ
ఇహ లోక సుఖములూ వద్దందీ
కృష్ణుని సేవలు చాలు యన్నదీ
గోదాదేవీ ఇట్లనుచున్నది..కన్నయ్యా
***********


కామెంట్‌లు