సౌందర్యలహరి; - కొప్పరపు తాయారు
🌻శంకర విరచిత🌻

సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః
వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః 
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః
వచోభిర్వాగ్దేవీవదనకమలామోదమధురైః ॥ 17 ॥

తనుచ్ఛాయాభిస్తే తరుణతరణిశ్రీసరణిభిః
దివం సర్వాముర్వీమరుణిమని మగ్నాం స్మరతి యః 
భవంత్యస్య త్రస్యద్వనహరిణశాలీననయనాః
సహోర్వశ్యా వశ్యాః కతి కతి న గీర్వాణగణికాః ॥ 18 

17) ఓ జననీ! ఓ తల్లీ! వాసినీ మరియు మిత్ర దేవతలతో కలిసి నిన్ను ధ్యానించే వారు అన్ని వాక్కు మూలాలు మరియు తేజస్సుతో వెలిగే చంద్రకాంతలతో కూడిన శక్తి గల దానివిగా వెలుగొందు తల్లివీ ! వారితో పాటు మధురమైన కవితా రచన రచయితల కాగలరు కవిత్వం అభ్యాసానికి దేవత అయిన సరస్వతి నోటి సువాసనలు గల తల్లి!
18) ఊర్వసి తో సహా అనేకమంది స్వర్గంలోని వేశ్యలు అడవిలో భయంతో ఉన్న జింకల లాగా సిగ్గుతో కూడిన కళ్ళతో స్వర్గాన్ని మరియు భూమిని కాషాయ రంగులో స్నానం చేసే నీ రూపం సౌందర్యాన్ని ధ్యానించే వ్యక్తికి ఎలా ఆకర్షితులవరు
ఉదయించే  సూర్యుని తేజస్సు గల తల్లీ !
                *****🪷**** 
తాయారు 🪷

కామెంట్‌లు