గణతంత్ర దినోత్సవ పెరేడ్ లో పాల్గొన్న భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు  గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో  శుక్రవారం   ఘనంగా జరిగాయి.జిల్లా కలెక్టర్ శ్రీమతి పమెల్లా సత్పతి గారు ఉ.9-00 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేసి వేడుకలను ప్రారంభించారు.ఈ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పెరేడ్ నిలిచింది.ఈ సంవత్సరం పోలీసులు,ఎన్సిసి తో పాటు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు 22 మంది పెరేడ్ నిర్వహించారు.డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమీషనర్ అడిగొప్పుల సదయ్య గారి ఆధ్వర్యంలో జి.ప.ఉ.పా.చింతకుంట,జి.ప.ఉ.పా.రుద్రారం,టి.ఎస్.ఎమ్.ఎస్.ఎలగందల్,కె జి బి వి కరీంనగర్ ,పారమిత పాఠశాలల నుండి 25 మంది విద్యార్థులకు పెరేడ్ శిక్షణ ఇవ్వడం జరిగింది.అద్భుతంగా పెరేడ్ నిర్వహించిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను జిల్లా కలెక్టర్ శ్రీమతి పమెల్లా సత్పతి గారు అభినందించి,ప్రత్యేక ప్రశంసాపత్రాలు అందించారు.జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ జనార్దనరావు గారు మాట్లాడుతూ స్కౌటింగ్ వలన విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు దేశభక్తి,దైవభక్తి, సేవాభావం లాంటి మంచి లక్షణాలు అలవడి మంచి భావి భారత పౌరులుగా రూపొందుతారని తెలియజేశారు.జిల్లా కార్యదర్శి శ్రీ కంకణాల రాంరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో స్కౌటింగ్ కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతున్నాయని,ఇప్పటికీ జిల్లాలో 32 యూనిట్లు నడుస్తున్నాయని,మిగిలిన పాఠశాలల్లో కూడా ఏర్పాటు చేయడానికి జిల్లా విద్యాశాఖాధికారి గారి సహాయంతో కృషిచేస్తున్నామని తెలియజేశారు.ఈ గణతంత్ర వేడుకల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ఆఫీసర్లు శ్రీ షరీఫ్ అహ్మద్ ,కె ఈ శ్రావణ్ కుమార్, గణేష్ సింగ్ టాకూరు; గైడ్ కేప్టన్స్ కె శ్రావణి,డి రజిత పాల్గొన్నారు.


కామెంట్‌లు