ప్రపంచ తీరు;- వై నీరజరెడ్డి తెలుగు భాషొ పాధ్యాయురాలు జడ్పీహెచ్ఎస్ పన్యాల
 విలువలను మంటగలిపి,
ప్రాణం లేని వస్తువులను ప్రేమిస్తూ,
ప్రాణాలు ఇచ్చే వారిని నిర్లక్ష్యం చేస్తూ,
బాధ్యతలను గుదిబండలుగా భావిస్తూ,
నందనవనం లాంటి జీవనాన్ని
నరకప్రాయంగా మారుస్తూ,
నమ్మకాలను నట్టేటిలో ముంచుతూ,
నయవంచనలే జీవితంగా భావిస్తూ,
నేడు నరుడు బ్రతుకుతున్న జీవనం,
అగుపించదు ఎంత వెతికినా పవిత్రం,

ఆశలు ఆకాశానికి నిచ్చెనలు వేస్తే,
గ్రహచారం గమ్యానికి అడ్డంకి.
అందలం ఎక్కించాలంటే శ్రమతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి.
అది తెలియక అందని దానికోసం ఆశ పడుతూ ఆగమాగం అయితుండ్రు.

ఏటిలోని చేప నీటికి ఎదురీది నట్టు, జీవితమంతా ఆరాటమనే ఈతను ఈదుతుంటే నీ గమ్యాన్ని చేరేది ఎప్పుడు?
ప్రశాంతంగా సేద తీరేది ఎప్పుడు?
దేవుడు ఆడించే ఆటలో,
 మనకు కేటాయించిన సమయం ఎంతో,
ఆ కాలాన్ని నిర్విరియం చేసుకుంటే, మన బ్రతుకు మనం బ్రతికేది ఎప్పుడు?
ఇదే కదా మనిషి జీవించే ప్రపంచ తీరు...

కామెంట్‌లు