ఎస్సీకాలనీ పాఠశాల పిల్లలకు చేతిరాతలో పోటీలు

 జాతీయ చేతిరాత దినోత్సవాన్ని పురస్కరించుకొని కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం పాఠశాల పిల్లలకు చేతిరాతలో పోటీలు నిర్వహించారు. 3, 4, 5వ తరగతి చదువుతున్న బాల బాలికలకు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పోటీలు నిర్వహించి, ప్రతి తరగతి నుంచి ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన వారిని ఎంపిక చేశారు. వచ్చే గణతంత్ర దినోత్సవ దినోత్సవం రోజున చేతిరాత పోటీలో గెలుపొందిన పిల్లలకు బహుమతులు అందజేయనున్నట్లు  పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో చేతిరాత నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణనిస్తున్నామన్నారు. గత ఎనిమిదేళ్లుగా వేసవి సెలవుల్లో కూడా పాఠశాలలో చదివే పిల్లలకు యోగ, స్పోకెన్ ఇంగ్లీష్, చేతిరాతపై రోజుకు రెండు గంటలు ఉచితంగా ప్రత్యేక శిక్షణనిస్తున్నామని ఈర్ల సమ్మయ్య తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు కష్టించి సంపాదించిన వేలాది రూపాయలను వృధా చేసుకోకుండా, తమ పిల్లల్ని ఉచిత నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు