ఎగిరింది జాతీయ జెండా;- -గద్వాల సోమన్నఎమ్మిగనూరు.
ఎగిరింది! ఎగిరింది!!
మన  త్రివర్ణ జెండా
నింగిలో గర్వంగా
మురిపిస్తూ ముద్దుగా

రెపరెపలాడుతూ 
కనువిందు చేసింది
స్వేచ్ఛగా ఎగురుతూ
గళమెత్తి పాడింది

దేశ కీర్తిని చాటి
స్ఫూర్తినే ఇచ్చింది
లేదు దానికి సాటి
పౌరుషం నింపింది

జెండాను తిలకించి
రావాలి పౌరుషము
బద్దకమే నశించి
నిండాలి చురుకుదనము


కామెంట్‌లు