అక్షరసేవ;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అక్షరసేవతో
ఆరంభిస్తున్నా
జనవరి ఒకటిని
కొత్త వత్సరాన్ని

అక్షరతోరణము
కడతా
శుభకార్యమును
మొదలిడుతా

అక్షరకుసుమాలు
అల్లుతా
ఆంధ్రమాతమెడలో
అలంకరిస్తా

అక్షరసౌరభాలను
చల్లుతా
పరిసరాలను
పరవశపరుస్తా

అక్షరదీపాలు
వెలిగిస్తా
తేటతెలుగును
మెరిపిస్తా

అక్షరసేద్యం
చేస్తా
కవితాపంటలు
పండిస్తా

అక్షరామృతము
కురిపిస్తా
అధరాలను
క్రోలమంటా

అక్షరనైవేద్యము
సమర్పిస్తా
అద్భుతరుచులను
అందిస్తా

అక్షరహారతులు
ఇస్తా
వీణాదేవికి
మ్రొక్కిస్తా

అక్షరకౌముది
ప్రసరిస్తా
అంతరంగాలను
ఆనందపరుస్తా

అక్షరకిరణాలను
ప్రసరిస్తా
జగమును
జాగృతపరుస్తా

అక్షరసంపదలను
అందుకోండి
అభివృద్ధిపధమున
నడవండి

అక్షరసిరులను
పంచండి
అందరినీ
ఆహ్లాదపరచండి

============================================

🌷🌷🌷🌷అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు🌷🌷🌷🌷

కామెంట్‌లు