విద్యార్థి దశ;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 కుటుంబంలో ఎప్పుడు క్రమశిక్షణతో  జీవితాన్ని కొనసాగించడానికి  విద్యార్థి దశ ప్రారంభమవుతుందో  ఆ దశ జీవితానికి నాంది  అలాంటి పిల్లలు మంచి గుణవంతులతోనే స్నేహం చేస్తూ ఉంటారు  వారందరూ మంచి ఆలోచనలు చేస్తూ  తమకు తమ పాఠశాలకు  పేరు తీసుకువచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు  తల్లిదండ్రులు మొదటి నుంచి చెప్పవలసిన విషయం  ఉన్నత పాఠశాలలో చదువుతున్న పిల్లలు  యవ్వన ప్రారంభ దశలో ఉంటారు  వాడికి చెప్పవలసిన మొదటి పాఠం  వారితో పాటు ఆడపిల్లలు కూడా వస్తూ ఉంటారు కనుక వారందరినీ తమ అక్క చెల్లెలు వలె చూడాలని  ఏ పరిస్థితుల్లోనూ పిచ్చి వేషాలు వేయకూడదని  వారిని ఏ పరిస్థితిలోనూ ఆటపట్టించకూడదని  వారు కన్నీరు పెట్టుకునే స్థితి తీసుకురాకూడదని  తల్లిదండ్రులు చెప్పాలి.
ఏ కుటుంబంలోనైనా గృహిణి పిల్లల పెంపకంలో ప్రధాన పాత్ర తీసుకుంటుంది బిడ్డలు కూడా  అమ్మ చెప్పిన బాటలో నడుస్తూ  ఆమె చెప్పిన ప్రతి అక్షరానికి విలువనిచ్చి అలాగే ప్రవర్తిస్తూ  ఆమెకు మంచి పేరు తీసుకువచ్చాడా మెలుగుతాడు  తన తరగతిలో జరిగిన అనేక విషయాలను అమ్మతో తప్ప నాన్నతో చెప్పుకునే అవకాశం లేదు  ఆ చొరవ నాన్న దగ్గర ఉండదు  ఇలా ఆడపిల్లల  విషయానికి వచ్చేసరికి వారు చెప్పిన మాటలను   హాస్యోక్తులను  తల్లికి చెప్పడం సహజం  దాని అర్థం ఏమిటో ఆమెకు తప్ప బిడ్డకు తెలియదు  తాను కూడా భార్య స్థితి దాటిన తర్వాతనే గర్భిణీ పాత్ర స్వీకరించింది  కనుక ఈ కుర్రవాడు చెప్పే ప్రతి విషయం ఆమెకు తెలుసు తాను తన స్నేహితురాండ్రు   అనుభవించిన విషయాలే  వీటిలలో కొత్తవి ఏమి ఉండవు. బిడ్డ ఎంతో సంతోషంగా చెప్పిన మాటలను విశ్లేషించుకుని దాని అర్థాన్ని ఆవిడ అర్థం చేసుకొని  ఆమె మనసును విశ్లేషించగలిగిన జ్ఞానం అమ్మకు తప్ప మరొకరికి ఉండదు  ఆ మాట్లాడిన తర్వాత ఆమెతో స్నేహం చేయవచ్చును చేయకూడదు  ముందు తాను నిర్ణయించుకొని తరువాత బిడ్డకు తెలియజేస్తుంది  సామాన్యంగా క్రమశిక్షణకు బానిస అయిన ఏ కుర్రవాడు తల్లి మాటను జవదాటలేడు  దాటడు కూడా  దానితో వారి స్నేహం పెరగడము విరగడము జరుగుతుంది  ఇది మగ పిల్లలకు మాత్రమే పరిమితం కాదు  ఆడపిల్లలను  ఎలాంటి మాటలతో వలలో వేసుకోవాలో తెలిసిన ఘటికుడు ఆ వయసులో కొంతమంది ఉంటారు  అంతకంటే ఆ పాఠశాలలోనే ఒకటి రెండు  దృష్ట్యాంతాలు కూడా జరిగే ఉండవచ్చు  వాటిని ఆధారం చేసుకుని ఆడపిల్లల తల్లి మరింత జాగ్రత్త వహించి బిడ్డను తన చెప్పు చేతుల్లో ఉంచుకునేలా చేస్తే  ఆ పాప జీవితాన్ని రక్షించినదవుతుంది తల్లి.


కామెంట్‌లు