అడుగు జాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 విగ్రహాలు శాసనాల దగ్గర పరిశీలిస్తున్న రెడ్డి గారి బృందాన్ని కార్తిక దీపారాధన చేస్తున్న స్త్రీలు వింతగా చూస్తున్నారు  పూజారులు కూడా అంతే ఒక్కరు కూడా  మీరు ఎవరు అని అడిగిన పాపాన పోలేదు. శిథిల శిల్పాలు ఆలయ విడి భాగాల దీన స్థితిని చూసి బాధపడుతూ ఉండడం కంటే ఏమి చేయలేక శివునికి నందికి శిల్పాలకు ఆ ఆలయం ఆ పేరును దక్కించుకోవడానికి కారకులైన ఆగస్త్య మహామునికి శాసనాల్లో పేర్కొన్న అమరి నాయుడు పోచు లెంకలకు నమస్కరించి బయటికి నడిచారు రెడ్డి గారి బృందం  కొలకలూరులోనే కొంచెం దూరంలో ఉన్న కేశవ స్వామి దేవాలయానికి వెళ్లారు రెడ్డి గారి బృందమంతా గ్రామస్తుల్ని మెచ్చుకోవాలి అక్కడ ఆలయం ముందు భాగాన్ని మాత్రమే ఊడదీసి అసలు గుడిని అలాగే ఉంచారు ఆనందంతో లోపలికి అడుగుపెట్టగానే అక్కడ దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన స్థల పురాణ బోర్డులు చూసీ చూడగానే వారి ఆనందం పటాపంచలయ్యింది అందులో అన్నీ తప్పులే కొలకలూరు 101 కొలనులు ఉండేవని వాటిని పూడ్చి బావిగా ఏర్పడినవి కాలక్రమేళా ఇది కొలకలూరిగా మారిందని సోమయ్య లెంకం గారిచే ఆలయం నిర్మించబడినది ఈ స్థల నిర్ణయం గ్రామ నిర్ణయం మొదలగు వివరాలు పాళీ భాషలో ఇప్పుడు విపులికరించబడిన శాసనముల ద్వారా తెలుస్తోంది. ఇట్లు కార్యనిర్వహణాధికారి అని ఉంది శాస్త్రం తెలుగులో ఉంటే పాళీ పాళీ పాషాని లెంకం గారికి వెంకం గారిని ఉంది ఇప్పటివరకు ఎంతోమంది దేవాదాయ శాఖ అధికారులు ఆలయ పూజారులు గ్రామ పెద్దలు చూస్తూనే ఉన్నారు కానీ ఒక్కరు దాన్ని సరి చేద్దాం అని  అనుకోక పోవడం విడ్డూరమే కేశవ స్వామి దేవాలయంలోని స్తంభాలు ద్వారాలు కొప్పు చక్కటి కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతున్నాయి ఆలయ గోడలకు బిగించిన చెన్నకేశవుడు సూర్యుడు దక్షిణ ప్రవేశ దూరానికి రెండు వైపులా గల నిలువెత్తు విజయ ద్వారా పాలక శిల్పాలు కనువిందు చేస్తున్నాయి ఆలయానికి శిల్పాలకు సున్నం రంగులు కొన్ని ప్రాచీనతకు భంగం కలిగించే మన సుప్రభా కాపాడవలసిన దేవాదాయ శాఖ అధికారులకు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించలేదు రెడ్డి గారికి ఎందుకంటే ఎలాంటి దృశ్యాలు చూసి చూసి దేవాదాయ శాఖ పనితీరు దశాబ్దాలుగా ఇంతేగా అని అనిపించింది  మనసులో రెడ్డి గారికి కొలకలూరు లోని రెండు ఆలయాలను చూసి బరువెక్కిన హృదయంతో జిల్లాలోని పేరు మోసిన నందివెలుగులోని నంది విగ్రహాన్ని చూడడానికి బయలుదేరారు బృందం  అలా బయలుదేరడానికి ఒక బలమైన కారణం ఉంది ఆ ఊరికి పేరు నిలిపిన నందిని పట్టాభిషేకం జరిగి  వెయ్యిళ్లు అయినా  రాజరాజ నరేంద్రని శాసనాన్ని చూడాలని అదే ఆ బలమైన కోరిక గ్రామంలో మందు గా పేరుగాంచిన మేడ అదే దారిలో వెళ్లి ఎడమ వైపున అత్యేశ్వర స్వామి (శివుని) ఆలయం ఉన్నాయి  కారు దిగి దిగగానే ఎదురుగా మొండి చాముండి చక్కటి వేంగి చాళుక్య బైరవ వీరఘల్లు ఋషి పొంగవుల శిల్పాలు ఒళ్లంతా పసుపు కుంకుమ బొట్లతో దర్శనమిచ్చినాయి బెంచి పై కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నారు ఆ గ్రామంలో కొంతమంది గ్రామస్తులు.



కామెంట్‌లు