గద్దరు పద్య మాలిక; వినాయక్ రావు , భైంసా 9440749686
1.కం:గద్దరు నీగళమయ్యెన్
నిద్దుర లేపంగ జనుల నిక్కమునెర్గన్
యుద్ధము తప్పదనంటున్
హద్ధులు దాటంగ పబువు నాపుట కొరకై

2.కం:కంఠధ్వని నమరంబున్
గంటలమ్రోగంగ జనుల కర్ణము లందున్
వింటాలములా తిర్గుతు
తుంటరి మనుషుల్ని మార్చె దొడ్డగళమదిన్

3.కం:గద్దరు గాయగ విన్నన్
నిద్దుర మత్తంత వదిలి నీరస మొదులున్
బద్దకము వదుల జేయును
బుద్దిని ప్రేరించు నదియు బోధి పులాకై

4కం:కవి గాయకుండు గద్దరు
భువిమెచ్చినముద్దు బిడ్డ మోదము పంచెన్
నవిరతముగ పోరాడెన్
భవితవ్యమునొంద తెల్గు ప్రజల మనిషిగన్

5కం:నింగికి నెగిరెను చుక్కై
భంగిమలతొ పాటపాడు బడుగుల హితుడున్
సంగడి పంచెను బీదకు
బంగరు గద్దరు పదములు పరిపరి విధముల్

6.కం:చుక్కల చంద్రుడు గద్దరు
మ్రొక్కెటి దేవుండు బీద మోకారించన్
చక్కని గళమాతనిదిన్
పెక్కురు మెచ్చంగ పాట ప్రేమతొ వినదిన్

కామెంట్‌లు