శబరి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 శబరి వారి పాదాలను తాకుతుంది. వారి నయన మనోహర రూపాన్ని తన నిర్నిమేష నేత్రాలతో చూస్తోంది వారి పాదాలను ప్రక్షాళిస్తుంది నీటితో వారు త్రాగడానికి నీళ్లు తెచ్చి అందిస్తుంది  తినిపించడానికి కూడా ప్రయత్నిస్తుంది మహర్షుల నిలయం మాతంగ వనంలోకి వెళ్లి కందమూలాలను ఫల పుష్పాలను కోసి తెచ్చి రామలక్ష్మణులకు ఇచ్చి వారిని తినమని ప్రాధేయపడుతుంది ఆత్మ స్వరూపమైన శ్రీ రాముడు శబరి వినామృత విశిష్టత నిష్టలకు మెచ్చి ఆనందిస్తూ శబరిని నీ తపస్సు ఎలా సాగుతోంది అని అడుగుతాడు సాత్విక శబరి తన సహజ స్వభావ సాత్విక రీతిలో శ్రీరామచంద్రా నీ దర్శనం వలనే తపోఫలం అందింది నా తపస్సు ఇలా ఫలించింది అని చెప్పింది అప్పుడు శ్రీరాములు అదుపులో ఉంచుకుంటున్నావా నీ ఆహార విహార వ్యవహారాలలో నీకు నియంత్రణ ఉన్నదా నీ నిష్టాగరిష్ట ప్రపూర్ణ జీవితంలో నీకు ఎలాంటి అవాంతరాలు ఎదుర్కోవడం లేదు కదా అని అడుగుతాడు. ఇహలోక జీవితానికి దూరమై పంపా తీరంలో ఏకాంత జీవితం కొనసాగిస్తున్న శబరి వీనులకు శ్రీరాముని అమృత వాక్కులు అత్యంత అమృతంగా వినిపించాయి శబరి శ్రీరామ నీవు చిత్రకూటం చేరిన సంగతి తెలిసినప్పటి నుంచి నీ రాకకోసము ఎదురుచూస్తున్నానయ్యా  మతంగరుషులు మునులు నీ రాకను గురించి నాకు చెప్తూ నీవు వచ్చేవరకు వేచి ఉండమని నన్ను కోరారు అని చెబుతుంది అప్పుడే ఆ బంగారు కణాలు రానే వచ్చాయి శ్రీరాముని దర్శించుకునే భాగ్యం శబరికి కలిగింది శబరి నా జీవిత లక్ష్యం నెరవేరింది శ్రీరామచంద్రమూర్తి నీ అనుమతి అయితే పరంధామాన్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటుంది  వనంలో లభించే ఫల పుష్పాదులు ఏరి కోరి తెచ్చినవన్నీ శ్రీరామునికి సమర్పించగా రాములు ఒక్కొక్కటి తింటూ శబరి భాగ్యాన్ని మెచ్చుకున్నాడు.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే శ్రీరాముని ఆనందాన్ని ప్రసాదించే వస్తువు రుచికరమైన పండ్లలో లేదు శబరి సహజ సాత్విక స్వభావంలోనే ఉంది అందుచేతనే శ్రీరాములు ఆశ్రమల్లోని ప్రతి వస్తువును నిషితంగా పరిశీలిస్తాడు ఈ విషయాన్ని వాల్మీకి మహర్షి ఇలా అంటారు  రాఘవ ప్రాహీ విజ్ఞానే అనగా శ్రీరాముడు విజ్ఞాన భూమికను ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాడు అని ఈ విజ్ఞాన భూమిక ఆత్మ యొక్క విషోక భూమిక ఇక్కడ అందుచేతనే లౌకిక వాసనలు అలౌకిక భావనల్లో సంచరిస్తున్నట్లుగా తోస్తుంది  శబరి ఆదిత్య సత్కారాల అనంతరం శ్రీరాముడు మాతంగ వన విశేషాలు చూడాలని ఇష్టపడతాడు ఎందుకంటే శ్రీరాములు ఈ వరం యొక్క  నిత్య మరియు  అబహిష్కృత ప్రభావాన్ని కబంధుని ద్వారా తెలుసుకొని ఉన్నాడు కనుక  శబరి శ్రీరామునకు ఈ వన సౌందర్యాన్ని యావత్తు దర్శంపచేస్తోంది సవివరంగా వర్ణిస్తుంది.

కామెంట్‌లు