విప్లవ వీరుల విజయ విహారం ఆపడం కోసం ఏ దారి కనపడక వారి మనసులలో కోయ చెంచులే వారికి ఆహారాన్ని ఇచ్చి పోషిస్తున్నారు అని తలచారు. ఆహార సామగ్రి అందకపోయినా వారందరూ కూడా లొంగిపోయి ఉండేవారు వారి ఇండ్లలో వెతికి వారి ఆహారాన్ని ప్యునిటిక్ పన్ను గా జప్తు చేసి బండ్లపైకి ఎత్తించి గిడ్డంగులకు పంపి కాపల పెట్టారు ఆ అడవిలో ఆహారం లేక అలమటించే వారిని చూసినా రామరాజు మన్య సోదరులకు తన ఆజ్ఞను పంపాడు. దానితో అగ్గి రాజు ఎంతో ఆగ్రహంతో లేచాడు తోటి వీరులు మన వెంట తోడుగా కదలి గిడ్డంగి కాపలా వారిని కొట్టి ప్రజలకు ఆహారములను పంచి పెడుతూ ఉంటే దొరల ఎత్తును పసిగట్టి వీర వరులు సైనికులకు అంచు సరుకులాలను అడ్డగించుతూ బాధ పెట్టిన సైనికులకు దీనిని పంచాలా అని కోపం తెచ్చుకున్నాడు. మన సోదరులను వదిలి వారికి ఆహారాన్ని పంపించమనడం అగ్గిరాజుకు నచ్చలేదు ఆహారం లేక సైనికులు ఆకలితో రకరకాలుగా బాధపడుతున్నారు ఆంధ్ర దేశంలో అందాల సీమ అది అరకు లోయ అతి రమ్యమైనది మన్య భూమిని చేరడానికి మంచి మార్గం అయింది ఎన్నో రకాల బండ్ల బాటలు ఉన్నాయి ఆ బాటలలో ఏడు వంపుల అతి ముఖ్యమైన అడవిలో ఆ బాటలో నడిచి ఆహారాలను తీసుకుని వచ్చి బారులు తీరినట్టుగా ఆహారంతో నిండిన బండ్లు వస్తూ ఉన్నాయి సైనికుల కొరకై సర్కారు పంపింది ఆ సరుకులు తిండి సామాగ్రి అంతా ఉంది ఈ దారిలో ఒక ప్రక్క ఎత్తైన కొండలు ఒక ప్రక్క లోతైన ఏటి వాగు ఇరుకు దారికి అచ్చట 7 వంపులు ఉన్నాయి వంపులకు ఇరుపక్క వెదురు భూములు బండ్లకు ముందు పోలీసులు శబ్దం చేయకుండా బండ్లను నడిపిస్తున్నారు. ఆ సమయంలో నక్కల ఊలలు ఒక్కసారిగా లేచినయ్ కుక్కల అరుపులతో ఆ కొండ మొత్తం నిండి ఉంది చెత్త పై ఉన్నప్పుడు ఒకచోట చేరి ఆకాశంలో గుంపులు గుంపులుగా అరచి గోల చేస్తున్నాయి భీకర ధ్వని చేస్తూ బెబ్బులి ఒకటి బండ్ల మధ్య దూకి వారితో కేకలు వేయించింది బెదిరిన ఎడ్లు బండ్ల చిడతలను వదిలివేసి కనిపించిన దిక్కు ద్వారా పరిగెత్తడం మొదలుపెట్టింది ముందు వెనుక ఒక్కసారిగా తుపాకులు మోగినాయి పోలీసులు ఏ దిక్కుకు వెళ్ళినారు ఏ ఒక్కరికి తెలియదు కలికానికి ఒకరైన రావడం లేదు అక్కడ బండ్లు మాత్రం భద్రంగా ఉన్నాయి ఇరువైపులా కొందరు వచ్చి చుట్టుముట్టారు వారి విప్లవ వీరులట నాయకుడే నడిచే అందరి ముందర ఆజ్ఞలని ఇస్తూ అగ్గిరాజు బండ్లను మోపున గట్టి వీరుల లాగా కొనిపోయారు ఆ బండ్లను.
ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి