స్వయం ప్రభ- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 హనుమంతుడు ఆమె సహాయం లేకుండా ఈ చీకటి గృహం నుంచి బయటపడలేమని గ్రహించినందుకే ఆమె సాయం కోరాడు తప్పని పరిస్థితుల్లో పైగా ఆమె గొప్ప ఉదార స్వభావురాలు కూడా అని అర్థం అయిపోయింది ఈ బిలం లోకి వచ్చిన వారు మళ్ళీ సజీవులుగా బయటపడలేరు అనే విషయం కూడా స్వయం ప్రభకు తెలుసు కానీ వీరు శ్రీరామచంద్రమూర్తి కార్యార్థం వచ్చారు కనుక తాను వీరికి తప్పక సాయం చేయాలి అది తన పరమ ధర్మమని భావించి స్వయం ప్రభ మీ కళ్ళను వేళ్ళతో మూసుకోండి అని చెప్పింది అందరూ ఆ పని చేశారు ఒక క్షణంలో స్వయం ప్రభతో సహా అందరూ బిలం నుంచి బయటకు వచ్చారు వానరులకు ఎదుటి సముద్రాన్ని చూపి తన బినములోకి ప్రవేశించింది శ్రీదేవి మరలా శ్రీ బిలంలోకి ప్రవేశించి  అంతర్లీనమైనది. ఈ విధంగా స్వయం ప్రభ వానరసేనకు ముఖ్యంగా హనుమంతులకు భావి సీత అన్వేషణలో ఉపయోగపడే విధంగా విశిష్ట అనుభూతిని ప్రసాదించింది. స్వయం ప్రభ సెలవు అనంతరం సముద్రపు ఒడ్డున సంపాతి అను పక్షితో పరిచయమైంది దూర దృష్టి శక్తి సంపన్నురాలైన ఈ పక్షి తన అలౌకిక దృష్టితో సీతస్థాయిని వానర్లకు అవగతం చేస్తుంది ఈ పక్షి నుంచి దాని దూర దృష్టి తనకు లభించాలంటే హనుమంతులకు వారి సమూహానికి స్వయం ప్రభ చీకటి గుహ పరిచయం ఉండి తీరాలి.లంకలో మహిళల మధ్య బందితురాలు అయిన జానకి జాడ తెలియలంటే ఈ అనుభూతుడు అన్నిటిని పొందితేనే వాటిని ఒక్కొక్కటిగా మహత్తును తెలుసుకోవలసి ఉంది  స్వయంప్రభ ఆజ్ఞా చక్రం యొక్క సర్వజ్ఞ సాధన యోగ శాస్త్ర ప్రకారం ఆజ్ఞా చక్రం మూలాధారం నుంచి ఆరవ చక్రం ఇది రెండు కళ్ళ మధ్య ముక్కు పై భాగాన రెండు బ్రుకుటుల సంధి స్థలం మీద
ప్రతిష్ఠితమై ఉంది. శరీరము కంఠమును  సమానముగా ఉంచి రెండు కన్నుల దృష్టిని ముక్కుకొనలపై కేంద్రీకరిస్తే ఆజ్ఞా చక్ర దర్శనం లభిస్తుంది. ఇక్కడే శరీరము యొక్క రుద్ర గ్రంథి ఉంది అన్ని గ్రంధ్రులలో ప్రథమ గ్రంధి బ్రహ్మ గ్రంధి ఇది మూలాధారంలో ఉంటుంది రెండవ గ్రంథి మణిపూర లేక నాభి ద్వారంలో ఉంటుంది దీనినే విష్ణు గ్రంధి అని అంటారు ఈ రెండు దాటిన తర్వాత సహస్రార చక్రంలో పరమాత్ముని సాక్షాత్కారము లభిస్తుంది  స్వయంప్రభ ఈ రుద్ర గ్రంథి ఆజ్ఞా చక్రానికి ప్రతీక  వీటిని దాటిన తర్వాత ద్రష్టవ్యుని దర్శనం లభిస్తుంది ఇంతకుముందు మందర కైకేయి యొక్క మైత్రి బంధం మూలాధారం బ్రహ్మగ్రంధి రూపంలో నిలబడింది అనసూయ యొక్క ప్రీతి దానం మణిపూర చక్రం విష్ణు గ్రంథికి ప్రతీకాలుగా నిలబడ్డాయి.ఇప్పుడు స్వయంప్రభ ప్రకాశ దానం (రుద్ర గ్రంధి) అంతిమగ్రంధి ఆజ్ఞ చక్రమునకు ప్రతినిధిత్వం వహిస్తుంది.

కామెంట్‌లు