స్వయంప్రభ- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.

 స్వయంప్రభ బిల రహస్యం ఈ అంశాన్ని బలపరుస్తుంది అంధకార బంధురమైన గుహలో తేజో వైభవం విరాజమానం అవడం ధ్యాననిమగ్నమైనప్పుడు లలాటం లోపల విరాట్ విశ్వ దర్శనాన్ని సూచిస్తుంది. మనం ధ్యాన నిమగ్ను లేనప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేసే సమయంలో ఇష్ట దైవాన్ని ధ్యానిస్తున్న సమయంలో బాహ్య ప్రపంచ సంబంధాలు తెగినప్పుడు ఆత్మ సౌందర్యం ఆశిస్తున్నప్పుడు కలిగే ఆనందమే అంతర జగత్ సాక్షాత్కరింప చేస్తోంది ఈ అనంత ఆజ్ఞా దర్శనంతో మనం చరితులమవుతాం. కానీ ఒకసారి సమాధి స్థితిని చేరిన తరువాత వెంటనే ప్రాకృతిక స్థితిలోకి రావడము కష్టమే ఆ సమయంలో ప్రభువు సహాయం అవసరం  ఎందుకంటే ఆయనే కదా మనల్ని రహాస్యత్మక జగత్తులోకి ప్రవేశపెట్టింది ఆనందింప చేసింది స్వయంప్రభ అంటుంది మీరు బిలం బయటకు వెళ్లాలంటే కళ్ళు మూసుకోండి.కన్నులు మూసుకుంటేనే సమాధి స్థితి లభించేది బయటపడేది కూడా ఈ పార్థివ నేత్రాలు మూసినప్పుడే అలౌకిక ప్రపంచ ద్వారం తెరవబడుతోంది అలౌకిక నేత్రాలను మూస్తేనే లౌకిక ప్రపంచంలోకే రావచ్చు ఈ రహస్యాన్ని కేనోపనిషత్తు ఇలా చెప్తుంది  విద్యుత్తు వలె ఆ తేజస్సు ఒక క్షణం ప్రకాశంతో నిండిపోతుంది మరు క్షణంలో మళ్లీ మరలిపోతుంది అని   తేజో వైభవమే శరీరాన్ని ఆ శరీరం గారు కాలాన్ని అకాలంగానూ సీమ సహితమైన దాన్ని సీమ రహితంగానూ కలుపుతుంది  ఈ ప్రకాశమే స్వయంప్రభ మనకు గోచరిస్తుంది దీని సాయంతోనే అశోక వనంలో విరాజమానురాలైన శ్రీ మాతా శ్రీదేవి సీతాదేవి దర్శనం సంభవిస్తుంది  ఈ విధంగా స్వయం ప్రభ పాత్ర రామాయణంలో అత్యంత ఆధ్యాత్మికతకు సువ్యవస్థితమై ఉన్నది ఆమెది మనోజ్ఞ కథ కావ్య దృష్టితో ఆమె పాత్ర కమనీయ కల్పన ఆధ్యాత్మిక దక్షితో పరికిస్తే ఆమె విశ్వాత్మ విరాట్ సౌందర్య సాక్షాత్కారం పొందడంతో అద్భుత సహాయ సాధనా పాఠం ఆమెతో సిద్దిపీఠం ప్రసిద్ధం. వేదాన్ని కావ్య రూపం కల్పించడంలో కృత సంకల్పుడైన ఆది వాల్మీకి మహర్షి స్వయం ప్రభ మాధ్యమం ద్వారా ఆలౌకిక సాధన తో ఒక అద్భుత మనోహర కథ రూపాన్ని ప్రసాదించాడు  కానీ చాలా కొద్ది మంది మాత్రం తర్వాత వచ్చిన రామ కావ్యాలలో ఎలాంటి ప్రాసంగీక ఇతివృత్తాలలోని లోతులను పరిశీలించారనాడంలో సందేహం లేదు కనుకనే రామాయణాన్ని ఒక కథ రూపంలో మాత్రమే పరిశీలించకూడదు. రాముని ప్రయాణంగా భావించాలి  శ్రీరాముని ప్రతిపాద కదలికతో ఆత్మ అనంత వెలుగు దర్శనమవుతుంది శ్రీ రాముల ఆత్మ యొక్క ఆనందమయ గాథ స్వయంప్రభ ఈ కథ యొక్క మహత్వ పూర్ణ గ్రంథిగా అమరం.

కామెంట్‌లు