తార;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.


 చెట్టుకు అంటిపెట్టుకున్న ఆకు లాగా తన భర్తను తార అంటిపెట్టుకొని ఉంది  అంగదునకు తుది సందేశం ఇవ్వమని తార భర్తను వేడుకొంది తన భర్త వాలి తుది శ్వాస విడుస్తూ పరలోక గతుడవుతున్న  క్షణాన తారకు దిక్కు తోచలేదు నిస్సహాయురాలు శోకసంలగ్న మానసగా గోచరిస్తుంది ఇంత దారుణ దుఃఖాన్ని భరిస్తూ కూడా తన గుండె ఎందుకు పగిలిపోలేదు అని విలపిస్తోంది వీరనారి తార దుఃఖాన్ని గాంచిన సుగ్రీవుని మనసు కూడా కకావికలమైపోయింది తన సోదరులతో పాటు తాను ప్రవేశించడానికి అనుమతి ఇవ్వమని సుగ్రీవుడు శ్రీరామచంద్రుని వేడుకున్నాడు  పరమ గంభీర మూర్తి శ్రీరామచంద్రుడు పరిస్థితుల మార్పును గ్రహించిన వాడై తారవైపు వెళ్ళాడు శ్రీరాముడు తన వైపు వస్తున్నట్లు తెలుసుకొని చూసిన తార మనసు పులకరించింది  శ్రీరాముని దర్శనంతో తార నోటి వెంట  ప్రశంసా స్తుతులు ధారాళంగా  వెలువడ్డాయి. అప్రమేయము జితేంద్రియుడని ఉత్తమోత్తమ ధర్మ మూర్తియు ఇలాంటి స్తుతి శబ్దాలతో శ్రీరాముని గుణకారం చేస్తుంది తార ఎక్కడ ఎవరు శ్రీరాముని దర్శించిన ఈ మహా శబ్దాలు వినిపిస్తాయి అందుకే వాల్మీకి శ్రీరాముని పూర్వభాషి అని చెప్తాడు ఇక్కడ తారే ముందుగా మాట్లాడుతూ ప్రశంసిస్తూ ఉంటుంది తార ఇంకా ఏమంటుందంటే నీవు సత్య ధర్మపురాతనుడవు మూర్తిభవించిన ధర్మ నిరతుడవు నీ ప్రతిష్టను అంచనా వేయడం సాక్ష్యం కాదు భూమాత వలె నీవు అందరిని క్షమించగలవు భరించగలవు నీ నైనాలలో వెలుగొందే విద్యుత్ దీపకాంతులు నీ పార్థివ శరీరం లోపల ప్రకటిస్తున్నాయి,  ప్రకాశిస్తున్నాయి నీకు నాదొక విన్నపం ఏ బాణంతో నైతే నా భర్తను సంహరించావో ఆ బాణంతోనే నన్ను కూడా చంపి నా భర్త వద్దకు చేర్చు దాని వల్ల మేము ఇద్దరం పరలోకంలో కూడా కలిసి మెలిసి జీవిస్తాం.ఈ విజ్ఞాపనను విన్న శ్రీరామచంద్రులు గంభీర ధీర స్వరంతో  సంవేదన భారంతో సార గర్బిత తన సందేశాన్ని తారకు ఇలా వినిపిస్తున్నాడు  మా వీరభర్చే విడుతీమ్ గురుభత్ నీవైతే వీరపత్నివే కనుక నీవు నీ మనసును ఇటువంటి విపరీత పోకడల వైపు మళ్ళించవద్దు దైవ నిర్ణయాన్ని శిరసా వహించి రాజీ పడవలసినదే నీకు పరమానంద ఫలం లభిస్తుంది చింతించవద్దు ఈ మాటలతో తార మనసు ధైర్యంతో నిండి పోయింది ఓదార్పు చేతనత్వం మెండుగా లభించాయి మంత్రముగ్ధురాలైన తార మౌనంగా నిలబడిపోయింది ఇప్పటివరకు వాలిని నడిపించిన తార ఇకనుంచి సుగ్రీవుని శ్రేయోభిలాషి  గా మారిపోయింది సుగ్రీవుని రాజ్యం సుగ్రీవునకు వచ్చింది పోగొట్టుకున్న భార్య రుమా కూడా తిరిగి వచ్చింది ఆర్థిక కష్టాలను సహించిన తర్వాత అధిక సుఖం ప్రాప్తిస్తే  అక్కడ అవసరం ప్రమాదం అనేది కూడా గోచరిస్తాయి.


కామెంట్‌లు