పరోపకారులు;- -గద్వాల సోమన్న,9966414580
విరిసే పూలలోన
కురిసే వానలోన
పరోపకారముంది
మెరిసే తారలోన

పారే యేరులోన
జారే తేనెలోన 
పరోపకారముంది
వీచే గాలిలోన

పొడిచే ప్రొద్దులోన
నడిచే కాళ్ళలోన
పరోపకారముంది
తుడిచే చేతిలోన

పెరిగే మొక్కలోన
మొరిగే కుక్కలోన
పరోపకారముంది
వెలిగే దివ్వెలోన


కామెంట్‌లు