సుప్రభాత కవిత ;- బృంద
చీకటి దుప్పటి తప్పిస్తూ
తూరుపు పిలుపుకు బదులిస్తూ
కోరుకున్న తీరానికి
చురుకుగ సాగే ఆడుగులు

కనులముందు కదలాడే
కలలు కన్న ఉదయం
కమ్ముకున్న కలతలన్ని
కరిగిపోవు తరుణం

పలకరించు పరవశాలు
చిలకరించు పరిమళాలు
పులకరించు భావాలు
కలవరించే క్షణాలు

తాకలేని శిఖరాలు
అందించే విజయాలకు
ఆహ్వానమంటూ
ఆహ్లాదంగా పిలిచే రహదారిని

వడిగ సాగు పయనాన
తోడైన అనుబంధాల 
వీడని నమ్మకం నీడగా
సాంత్వన పొందే జీవనపు

విజయపుదారుల వెంట
వెన్నుతడుతూ  
వెలుగులు వెదజల్లు
విలువైన వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు