'హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 57.
చంపకమాల.
ధ్రువుడను బాలకుండు మదిఁ దుఃఖముఁ బొంది తపంబు జేయ నా 
ప్రవిమల భక్తికిన్ మురిసి పట్టము కట్టితి వీవు పొంగుచున్
ధ్రువపథ మంచు వెల్గెనట దోషనివారణ!నీదు కూరిమిన్
దివసము రాత్రియున్ బొగడి దిట్టతనంబును బొందెదన్ హరీ!//
58.
చంపకమాల.
హరి!హరి!'యంచు బిల్వ కరి యార్తిని బాపగ వచ్చినాడవే
నిరతము దల్చు ద్రౌపదికి నిండుగ నిచ్చితె చీరసారెలున్
గురుతుగ పక్షిరాజు కిడి కొల్వున సేవను బ్రీతిమీరగన్
మరినను విస్మరించితివి మర్మము దెల్పుము వేగమే హరీ!//

కామెంట్‌లు