చుట్టూరా ఎందరు ఉన్నా
వ్యాపకంలో మునిగి తేలుతున్నా
తెలియని వెలితేదో ఆవరిస్తున్నా
చూడచక్కని తెలుగు సున్నితంబు
ఊగిస లాడకే మనసా
ఉబలాట పడకే మనసా
ఒంటరైతే అలుసని తెలుసా
చూడచక్కని తెలుగు సున్నితంబు
నిన్ను నీవు ప్రేమించు
నీకోసం సమయాన్ని వెచ్చించు
కలత జ్ఞాపకాలు దూరముంచు
చూడచక్కని తెలుగు సున్నితంబు
ఎవరిని పలకరించక సాధించేదేమి
గిరిగీసుకుంటే వచ్చేది ఏమి
పరామర్శ లేనిచో అర్థమేమి
చూడచక్కని తెలుగు సున్నితంబు
నిరాశనే మబ్బులు ముసురేసినా
ఆకాశమనే చెలిమి తోడుంటే
నక్షత్రం ఒంటరి అగునా?
చూడచక్కని తెలుగు సున్నితంబు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి