'హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 23.
ఉత్పలమాల.
ఆదివరాహమూర్తి వట నా తిరుశైలము పైన నిల్వగన్ 
మోదముతో సురల్ ప్రణతిఁ బుణ్యముఁ బొందగ సల్ప పూజలన్
నీదయఁ గోరు భక్తులకు నిత్యము తోడుగ వచ్చు నిన్ను సం
హ్లాదము తోడ మ్రొక్కి పరమార్థపు తత్త్వమెఱుంగుదున్ హరీ!//

24.
చంపకమాల.
నరహరి రూపమున్ గొనుచు నాదము జేసి పరాక్రమించి నీ
వుఱుకుచు వచ్చినావు కద!నుద్ధతిగా కడతేర్చ దైత్యునిన్
దురిత గుణంబులన్ దొలగ ద్రోయగ వైళమె దివ్యమూర్తివై
సరగున రమ్ము!మా దరికి సాత్త్విక తత్త్వము మించగన్ హరీ!//

కామెంట్‌లు