శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )- ఎం. వి. ఉమాదేవి
201)సంధాతాః -

జీవులకర్మలు జోడించువాడు
కర్మఫలమునిచ్చునట్టివాడు
ఆదేశించి కర్మచేయించువాడు
కర్మ కారణము తానైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
202)సంధిమాన్ -

భక్తులతో సదాకూడినవాడు
సాధుసంతులకలుపువాడు
సజ్జనకూటమినున్నవాడు
తాపసులను చేర్చుకొనువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
203)స్థిరః -

సదా ఏకరూపునున్నట్టి వాడు
మారని విధముగానున్నవాడు 
స్థిరత్వముతో యున్నట్టివాడు 
మహిమలు స్థిరమైనవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
204)అజః -

పుట్టుకయేలేని దివ్యాత్ముడు
నిత్యమును ఉండగలవాడు
అనాదిగానే సృష్టికారకుడు
తానే మొదటనున్నట్టివాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
205)దుర్మర్షణః -

అసురులను దండించేవాడు
రాక్షసప్రవృత్తిఅణిచినవాడు
దైత్యులు భరించలేనివాడు
దుష్ట సంహారంజేయువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు