అదితి_ దితి! అచ్యుతుని రాజ్యశ్రీ
 లక్ష్మీ నామావళి లో ఈరెండు పేర్లు వస్తాయి.ఇద్దరూ కశ్యప ప్రజాపతి భార్యలు.ఉత్తమ ఇల్లాళ్ళు. కానీ దైవభక్తి పతి ఆనతి తలదాల్చి అదితి దేవమాత గా ఆదర్శం గా నిల్చింది.ఆమె గర్భాన శ్రీమహావిష్ణువు కొడుకు గా పుట్టాడు.సూర్యుడు కూడా ఆమె పుత్రుడు అందుకే ఆదిత్యుడనే పేరు.ఆమె కొడుకు ఇంద్రుడు.బలిచక్రవర్తి స్వర్గంని ఆక్రమించితే ఇంద్రుడు పారిపోయాడు."నా కోడలు శచీదేవి ఆమె పిల్లలు జయంతాదులు‌ నామనవలు తిండి తిప్పలు లేకుండా ఆకల్తో అడవిలో తిరుగుతూ ఉన్నారు.వారి గతేంటి స్వామీ?" అని ఆమె ఏడుస్తూ భర్తని అడిగింది.ఆయన చెప్పిన ప్రకారం 12 రోజులు వ్రతం చేసింది.విష్ణువు ప్రత్యక్షమై " అమ్మా! నీ కడుపున వామనుడి గా  పుడ్తాను. బలిపీచం అణుస్తాను" అని అన్నాడు.అలా అదితి కడుపున దేవతలు ముఖ్యంగా విష్ణువు పుట్టడం విశేషం.ఇంద్రుడు మళ్ళీ సింహాసనం ఎక్కాడు.అలాగే శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు పుట్టాడు.వారు అదితి కశ్యప ప్రజాపతి దంపతులు.అంటే కశ్యపుడు అదితి సదా దైవ స్మరణ దర్శనంతో పునీతులైన ఆదర్శ దంపతులు.సురులు దేవతలు అదితి పిల్లలుగా మంచి పేరు తెచ్చుకున్నారు.అదితి మనోనిగ్రహం భక్తి మహాగొప్పవి.ఒక స్త్రీ ఇల్లాలు ఎలా ఉండాలో తెలియజెప్పింది ఆమె.
ఇక దితి కశ్యపుని రెండో భార్య.ఆమెకూడా మంచి గృహిణి.కాకపోతే ఆవేశం తొందరపాటు ఎక్కువ.ఒకరోజు సంధ్యాసమయంలో భర్తతో " నాకు సంతానం కావాలి.తల్లిని కావాలి.ఇప్పుడే నన్ను అనుగ్రహించండి"అని కోరింది."దితీ! ఈ సంధ్యాసమయంలో ప్రదోష కాలంలో ఉగ్రవేళ కలిగే సంతానం రాక్షసులు గా స్వార్థం తో ప్రపంచంని తలక్రిందులు చేసి చస్తారు ఆఖరుకి భగవంతుని చేతిలో! దైత్యులు దితి పుత్రులు అనే చెడ్డ పేరు యుగయుగాలుగా నిలిచి పోతుంది.రాత్రి చీకటి పడ్డాక నీకోరిక తీరుస్తాను.నీకు సంతానం కల్గుతుంది." అని ఎంతో నచ్చజెప్పాడు.కానీ మొండి కెత్తి భర్తను బలవంత పెట్టింది.అలా రాక్షస సంతానం తో దితి  బాధ పడింది.ఆమె బాధకు మార్గం చూపాడు భర్త." నీకు బలిచక్రవర్తి మనవడు ప్రహ్లాదుడి వల్ల మనశ్శాంతి కల్గుతుంది.దానవవంశంలో తులసి మొక్క లాగా ఆపిల్లాడు విష్ణు భక్తుడై అందరిమనసులో ఆచంద్రతారార్కం నిల్చిపోతాడు." అలా హిరణ్యాక్ష హిరణ్య కశిపుడు దితి పుత్రులు గా పుట్టారు.ఈకథ ద్వారా కుటుంబం భార్యాభర్తల సంబంధం సంధ్యాసమయంలో ప్రదోష కాలంలో చేయకూడని పనులు గూర్చి చెప్పారు.ప్రతి పనికి నియమం  ఓధర్మం ఉంది.కామక్రోధాది అరిషడ్వర్గాలను జయించి దైవ స్మరణ తో బతికే వారి జన్మ ధన్యం.పూజలు పునస్కారాలతో పాటు మంచి సంగీతం మంచి పుస్తకం చదవడం వల్ల మంచి భావాలు కలుగుతాయి.సాయంత్రం పిల్లలు ఆడుకోవడం కాసేపు పాటలు భజనతో గడిపితే చిత్తం ప్రశాంతంగా ఉంటుంది.దుష్టబుద్ధులు ఉగ్రవాదులు తలెత్తరు🌺

కామెంట్‌లు