సుప్రభాత కవిత ; - బృంద
కొలిచే పరమాత్మ
కనిపించే పరంజ్యోతివి నీవే

సర్వదేవతల ప్రతిరూపం
నీవే

ఏకాగ్రతతో తెలుసుకుంటే
ఎనలేని శక్తి స్వరూపానివి నీవే!

దేవాసురులు కొలిచే
సనాతన రూపానివి నీవే!

సహస్ర కిరణాలతో కరుణ వర్షించే
తండ్రివి నీవే!

సహస్ర నామాలూ కొనియాడే
తత్వం నీదే!

వెలుగులతో సమస్త జగతిని
ఆవరించి రక్షించే దైవానివి నీవే!

సర్వ జీవరాశులకూ వలసిన
ప్రాణశక్తి ప్రదాతవు నీవే!

కిరణాలతో ప్రాణ శక్తిని
ధరణిమీదికి వెదజల్లే కరుణ నీదే

త్రిమూర్తి రూపాలు
కలగలిసిన  ఏకరూపం నీదే

సమస్త శుభాలనూ ప్రసాదించే
శివుడివీ నీవే

కాలచక్ర గమనానికి 
ప్రమాణం నీవే!

అందరికీ ఆరోగ్య భాగ్యమిచ్చి
అనవరతమూ తోడుగా వుండి

అఖిల జీవాళికి ఆధారభూతమై
ఋతుచక్రం నడిపే ప్రత్యక్షదైవానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు