వృద్ధులకు సామాజిక భద్రత ఎండమావే;- సి.హెచ్.ప్రతాప్

 దేశంలో ఎవరైనా నిస్సహాయులుగా ఉన్నారంటే అది వ్యవస్థలు, పాలకుల వైఫల్యమే. ఆపన్నులను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత ను విస్మరించడం క్షమార్హం కాదు . సామాజిక రక్షణ అనేది వృద్ధుల ప్రాధమిక హక్కుగా గుర్తించాలి అని   ఒక వృద్ధాశ్రమాన్ని 2005 లో సందర్శించిన అప్పటి రాష్ట్రపతి  స్వర్గీయ ఏపీజే అబ్దుల్‌ కలాం చేసిన వ్యాఖ్యలు నేటికీ అక్షర సత్యాలుగా మిగిలిపోయాయి. . 12 సంవత్సరాలు  గడిచినా  ఇప్పటికీ దేశవ్యాప్తంగా వయోవృద్ధుల పరిస్థితి దయనీయంగానే ఉంది. సమాజంలోని దివ్యాంగులు, వితంతువులు, ఇతర సామాజిక వర్గాల వారు ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఐక్య రాజ్య సమితి ఇటీవల విడుదల చెసిన ఒక అధ్యయన నివేదిక ప్రకారం వృద్ధులకు సామాజిక రక్షణ పరం గా మన దేశం 92 వ స్థానం లో వుండడం నిజంగా సిగ్గు చేటు.   జీవితపు చరమాంకం లో  చుట్టుముట్టే  అనారోగ్య సమస్యలు, కన్నవారి నిరాదరణ వంటివి వారి జీవన స్థితిగతులను దుర్భరం చేస్తున్నాయి. సొంతంగా పనులు చేసుకోలేని నిస్సహాయ స్థితిలో వారు ఇతరులపై  ఆధారపడడం  తద్వారా వారి చీత్కారాలకు గురవడం న్న వైనం బాధాకరం. ఇక గ్రామీణ వృద్ధుల జీవితాలు గాలిలో దీపం చందాన తయారయ్యాయి. అయితే గత అయిదేళ్ళలో నరేంద్ర మోదీ నేతృత్వం లోని ప్రభుత్వం నిబద్ధతతో, చిత్తశుద్ధితో చేపట్టిన పలు సామాజిక వికాస కార్యక్రమాల ఫలితం గా వృద్ధుల జీవనం కాస్తంత మెరుగైందన్న సదరు నివేదిక కేంద్ర ప్రభుత్వం యొక్క నబద్ధతను చేటి చెబుతునే మరొక పక్క చేరుకోవాల్సిన లక్ష్యాలు ఎంతో దూరంలో వున్నాయని స్పష్టం చేస్తొంది..  మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రా లలో  సామాజిక భద్రత పరం గా కొంత మెరుగ్గా వుండడం ఆశాజనక పరిణామం. వృద్ధుల నిత్యావసరాలు తీరేందుకు ప్ర భుత్వ కార్యాలయాలు, బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు ఇతరచోట్ల వారికి అవసరమైన ప్రత్యేక సౌకర్యాలను కల్పించడం, రైళ్ళు, బస్సులలో ఉచిత ప్రయణం ఉచిత ఆంబులెన్సు, వైద్య సౌకర్యాలు, పిల్లలు లేనివారికి ఉచిత అంత్యక్రియలు జరిపించడం తో పాటు వారికి మెరుగైన జీవన స్థితిగతుల కోసం ఒక పటిష్ట ప్రణాళికను కేంద్ర రాష్ట్రాల సహకారం, సమన్వయం తో అమలు చేయాల్సి వుంటుంది. ఉద్దేశ్యపూర్వకంగా తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేసే పిల్లలకు కఠినమైన శిక్షలు విధించాలి. దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రతిపాదనను గత ప్రభుత్వాలు బుట్టదాఖలు చేసాయి. మోదీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనకు తక్షణం మోక్షం కల్పించడం ఎంతో ముఖ్యం.
కామెంట్‌లు