సౌందర్య లహరి; కొప్పరపు తాయారు
 🌟 శ్రీ శంకరాచార్య విరచిత 🌟

శివే శ‍ఋంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా
సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ ।
హరాహిభ్యో భీతా సరసిరుహసౌభాగ్యజననీ (జయినీ)
సఖీషు స్మేరా తే మయి జననీ దృష్టిః సకరుణా ॥ 51 ॥

గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతీ
పురాం భేత్తుశ్చిత్తప్రశమరసవిద్రావణఫలే ।
ఇమే నేత్రే గోత్రాధరపతికులోత్తంసకలికే
తవాకర్ణాకృష్టస్మరశరవిలాసం కలయతః ॥ 52 ॥

51) అమ్మా! జగజ్జననీ! చూపు శివుని పట్లశృంగార భావము చే ఆర్ర్దమైనది . శివుని కంటే ఇతరుల పట్ల బీభత్సం కలది. గంగ విషయాన రోషం, శివుని చరిత్ర పట్ల ఆశ్చర్యం, శివుడు దాల్చిన సర్పాల విషయంలో భయం, పద్మ సౌందర్యాలను మించి ప్రకాశించడంలో జయము, చెలికత్తెలతో చిరునవ్వు ప్రకటించే నీ దృష్టి నా ఎడల దయను కురిపిస్తున్నది కదా అమ్మా !
52) అమ్మా!ఓ పర్వత రాజవంశ  ప్రముఖతైక, బాణ సదృశ్యమైన నీ నేత్రద్వయం ఆకర్ణాంతం వ్యాపించి శివుని మనసును భంగపరిచే పల యుక్తమై ఉన్నది.
ఎక్కుపెట్టిన మదనుని  శరాలను నీ నేత్రాలు
శివుని మనస్సును ప్రభావితం చేస్తున్నాయి కదా తల్లీ! 
                   ****🪷***
🪷 తాయారు 🪷

కామెంట్‌లు