స్నేహం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఒక భోగము ఒక భాగము
జగములోన మన సంగము
అచలము మన స్నేహము
జూజము చేయరాదు మనమెపుడు
ఆటలాడు వయసు మన టకము
మడమ తిప్పని నేస్తాలం
గుణగణములు కలిసినట్టి
సతతము ఏకధ్యాస కలిగినట్టి
కుదరముల జంటను వలె
జ్ఞానముగల మన ద్వయము
కపటము లేని మనసున
ప్రబలమైన స్నేహమున ప్రబలిన
మమకారమె ప్రద్యోతము జగతిన
మాయము ప్రతికూల ఆలోచన మనలో
మరణము కూడా వేరుచేయని
దోలములో ఊరేగుదాము మనము!!

{భోగము=అనుభవము;సంగము=కూడిక;
జూజము=మోసము;టకము=కౌమారము;
కుదరము=గుర్రము;ప్రబలమైన=గొప్పనైన;
ప్రబలిన=వర్ధిల్లిన;ప్రద్యోతము=కిరణము;
దోలము=పల్లకి}
**************************************

కామెంట్‌లు