నేరేడు పండు(బాల పంచపది)-: వరలక్ష్మి యనమండ్ర
నేరేడు పండు ఔషధతత్వము
వేగంగా పెరగడం దీనిగుణము
పండు రుచి ఎంతో అద్భుతము
అందరికీ ఈ పండ్లంటే ఇష్టము
ఈ చెట్టును గిన్నె చెట్టుఅందురు... లక్ష్మీ

నేరుడులో ఉందో పోషకాల గని
ఇదెన్నో అనారోగ్యాల నివారిణి
చెబుతారు శక్తిని అందిస్తుందని
పెంచుతారు నేరేడు మంచిదని
నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి... లక్ష్మీ

పచ్చళ్ళు జామునుల తయారు
కలపను పనిముట్లుగ చేసేరు
ఆకులు తోరణాలుగా వాడేరు
దేవతా వృక్షంగా భావించెదరు
జీవితకాలం దీనికి ఎక్కువే... లక్ష్మీ

కడుపులో మలినాలను పోగొట్టును
వెంట్రుకలను అరుగుదల చేసేట్టును
శరీరానికి నేరేడు చలువ చేసేట్టును
నీరసం నిస్సత్తువ పోయేటట్టును
తక్షణ శక్తిని నేరేడు ఇస్తుందట... లక్ష్మీ

గుండెకు ఔషధంగా పనిచేయును
అధిక బరువును ఇవి తగ్గించును
దీర్ఘకాల వ్యాధులను నివారించును
ప్రతిరోజు ఆరు/ఎన్మిది తినవచ్చును
కాలేయపు పనితీరు మెరుగుపర్చును.. లక్ష్మీ

విటమిన్ సి కాల్షియము
ఫాస్వరసు మెగ్నీషియము
విటమిను బి గాక ఇనుము
నేరేడు పండ్లలో ఉండడము
నిజంగా మనకెంత అదృష్టము... లక్ష్మీ

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలము
నేరేడు పండు రక్తానికి ఆరోగ్యము
ఇచ్చును ఆరోగ్యవంత చర్మము
ఎముకలను చేయును దృఢత్వము
అందుకే మనంము నేరేడు తిందాం.. లక్ష్మీ

కామెంట్‌లు