306)సహస్రజిత్ -
=============
వేలాది అసురులగూల్చువాడు
అనేక శక్తులున్నట్టి వాడు
వేయియుక్తులు గలిగినవాడు
శక్తిప్రయోగము చేయువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
307) అనంతజిత్ -
అనూహ్యమైనట్టి వాడు
శక్తి సామర్ధ్యములున్నవాడు
ఎదుర్కొనువారిని జయించువాడు
అనంతయుక్తి గలిగినవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
308)ఇష్టః -
భక్తులకు ప్రియమైనట్టివాడు
తాపసుల్లో అనురక్తిగలవాడు
అందరికి ఇష్టుడైనట్టివాడు
ఆరాధనకు ప్రియమైనవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
309)అవిశిష్టః -
సర్వాంతర్యామి యైనవాడు
సూర్యకిరణ సమానుడైనవాడు
ఛేదనము లేనట్టివాడు
శిష్టులను ఆకర్షించువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
310)శిష్టేష్టః -
బుధజనులకు ఇష్టమైనవాడు
సాధువులందు రక్తిగలవాడు
శిష్టులను ఆదరించుచున్నవాడు
సజ్జనులకు సహాయం చేయువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి