సౌందర్యలహరి ; కొప్పరపు తాయారు
 🌟 శ్రీ శంకరాచార్య విరచిత 🌟

అసౌ నాసావంశస్తుహినగిరివంశధ్వజపటి
త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాకముచితమ్ ।
వహన్నంతర్ముక్తాః శిశిరతరనిశ్వాసగలితం
సమృద్ధ్యా యత్తాసాం బహిరపి చ ముక్తామణిధరః ॥ 61 ॥

ప్రకృత్యా రక్తాయాస్తవ సుదతి దంతచ్ఛదరుచేః
ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా ।
న బింబం తద్బింబప్రతిఫలనరాగాదరుణితం
తులామధ్యారోఢుం కథమివ విలజ్జేత కలయా ॥ 62 ॥
61) హిమాచల వంశానికి గల  కీర్తి ధ్వజాన్ని చేసే పతాకమా! నీ నాసాభరణము మాకు శీఘ్రంగా సముచిత ఫలాన్ని ప్రసాదించునది అగుగాక, కారణం దాని లోపల నీ అతి శీతల నిశ్వాసాల వల్ల ముత్యాలు ఏర్పడుతున్నాయి వామభాగంలోని ముక్కుపుడకలోని ఓ ముక్తామని బయటికి కనిపిస్తున్నది కదా తల్లీ !
62) చక్కని పలువరస గల ఓ తల్లీ ! కెంపులవలె
ఎర్రగా నున్న నీ పెదవులకు కోరిక చెప్పడానికి ఈ జగత్తులో సాటి అయినది లేదని నీ కింది పెదవిని ప్రవాలఫలము పగడ పండ్లతో పోల్చవచ్చు గాని పగడ పండ్లు ఎచ్చట లేవు దొండ పండ్లతో పోల్చు దామంటే దానికి నీ పెదవుల కాంతి సరికాదు. సింహము అంటే దొండ పండు నీ అధరాలకి ప్రతిబింబము కాబట్టి నీ పెదవులను పోల్చుటకు ఉపమానం లేదు. వాటికవే సాటి!
                         ***🌟****
🌟 తాయారు 🪷

కామెంట్‌లు