'హరీ!'శతకపద్యములు.- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 49.
చంపకమాల.
సరసుడవంచు నీ దరిని చక్కని గొల్లెత
లాడిపాడగన్
వరముల నిచ్చి తీర్చెదవు వాంఛల నన్నియు ప్రేమమీరగన్
స్థిరముగ నీదు సేవలను జేయగ  వచ్చితి దాసివోలె నే
వరములు కోరనయ్య!తనివారగఁ గాంచెద నిన్ను శ్రీహరీ!//
50.
చంపకమాల.
మరణము లేదు నా కనుచు మామగు కంసుడు విఱ్ఱవీగి ని
న్నెఱుగక సంహరించనట నేన్గును ద్రోలగ నుప్పతిల్లుచున్
గరినొక దెబ్బవేసి నరకమ్మున కంపిన వీరబాల!శ్రీ
కర!వడినార్పవయ్య!మదిఁ గాల్చెడి గర్వపు కీలలన్ హరీ!//

కామెంట్‌లు
Parvateesamvepa చెప్పారు…
ఎంతో చక్కని పద ప్రయోగాలతో మీ రచనలో రమణీయమైన కవన ధార ద్యోతకమౌతున్నది.
పద్యములను అలవోకగా రచించారని అనిపిస్తుంది.మీ కవన పటిమకు అనేక అభినందనలండీ.