శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
321)ప్రాణదః -

ప్రాణబలం అనుగ్రహించువాడు
జీవమును ఒసగగలవాడు
జీవి చేతనలకు కారకుడు
ప్రాణముకు కారణమైనట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
322)వాసవానుజః -

ఇంద్రుని తమ్ముడయినవాడు
దేవతలంతా కొలిచేవాడు
నాయకుడైయుండు వాడు
సురలోకంలో నున్నట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
323)అపాంనిధి-

సాగరమువలే ఆనంతుడు
తనలో అపారనిధులున్నవాడు
అధికజ్ఞానమిచ్చునట్టివాడు
సంపదలను ఒసగువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
324)అధిష్టానం-

సర్వముకు అధిపతియైనవాడు
ఆధారభూతుడైనట్టి వాడు
నాయకత్వము వహించువాడు
కర్మలను ఆదేశించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
325)అప్రమత్తః -

ఏమరుపాటు లేనివాడు
జాగరూకత కలిగినవాడు
తక్షణస్పందనయున్న వాడు
భక్తులను ఆదుకొనగలవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు