అవ్వ కట్టిన అటుకులమూట చేతబట్టి
అయ్య ఇచ్చిన రూపాయిబిళ్ళలు జేబులేసుకొని
బండిచివరన కూర్చుని ఒత్తులాటమద్యన
పుల్లూరు బండకెళ్ళిన రోజు యాదికొచ్చింది
బండమీది గుండాన తానమాడి
సొరికెలోని నరసింహుడి కొలిచిమొక్కి
బండ బెదురుడికి అదిరి పడినట్టి
జాతరంతా మదిన యాదికొచ్చింది
బైండ్ల డప్పుల మోతకు దద్దరిల్లి
పాములాట జూసి బెదిరి బెదిరి
రంగుల రాట్నమెక్కి యెడ్చినట్టి
మాఘమాస నాకు గుర్తుకొచ్చింది
దొస్తులందరితో కలిసి తిరిగి
బొమ్మలు,ప్యాలాల,జిలేబి మూటల సంచి
పీక,పుల్ల ఐస్,లాయిలప్పలతో
మర్రిచెట్టుకింద నిల్చింది యాదికొచ్చింది
పొలాల మద్యన పరుగులు
చెరుకుగడల పిలుపులు
తాటిచెట్టుకాడ అరుపులు యాదికొస్తున్నాయి
అందుకే వస్తున్న మన పుల్లూరుబండ జాతర
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి