ఎన్నడు మూయని పాఠశాల- జె వి కుమార్ చేపూరి- హైదరాబాద్
కుసుమ ధర్మన్న కళా పీఠం 
====================
దైవం సృష్టించిన జగన్నాటకంలో ఒక పాత్ర
జననమరణాల మధ్య కొనసాగిన యాత్ర
జీవితమంటే ఎన్నడు మూయని పాఠశాల
తీపి చేదులు వండి వార్చిన  పాకశాల 

నేర్చు జీవితం, ప్రకృతి నుడి ప్రతి విషయం
తనలా అందంగా జీవించమని నేర్పు పుష్పం 
రాలే ఆకు నేర్పు, జీవితం కాదని శాశ్వతం 
పారే యేరు నేర్పు, దాటాలని ఎత్తు, పల్లం 

మనకు నచ్చని, మన ప్రస్తుత ఉద్యోగం
ఒక నిరుద్యోగికిచ్చు, ఉపాధి జీవితకాలం      
మనకు విసుగు తెప్పించే సంతానం 
పిల్లలు లేని జంటలకు తీరని స్వప్నం 

జీవితమంటే, అంతులేని ఒక పోరాటం 
నొప్పులు భరిస్తేనే, స్త్రీకి దక్కు మాతృత్వం 
మట్టితో పోరాడితేనే బీజం కాగలదు వృక్షం 
యముడితో పోరి, పొందె సావిత్రి మాంగల్యం

తృప్తి గల జీవితం, మధురాతి మధురం 
తృప్తి లేని జీవితం, అనుక్షణం దుర్భరం
సిరులెన్ని ఉన్నా, తృప్తి లేని జీవితం వ్యర్థం 
చింకి చాపైనా, గురక పెట్టగల జన్మ ధన్యం

కామెంట్‌లు